Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత విద్వేషాలను రెచ్చగొట్టే 40 వెబ్‌సైట్లు నిషేధం..

Webdunia
సోమవారం, 27 జులై 2015 (15:39 IST)
దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో అభిప్రాయాలను వెల్లడిచేస్తూ, వార్తలను ప్రచురిస్తున్న 40 వెబ్‌సైట్‌లను సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం 2009 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇటీవల కాలంలో తీవ్రవాద సంస్థలు ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో ఫోటోలను, వీడియోలను వెబ్‌సైట్‌లలో పెడుతున్నాయి. మతవాదాన్ని, తీవ్రవాదాన్ని విస్తరింపచేసేందుకు వెబ్‌సైట్‌లను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు దేశ శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని ఇటువంటి చర్యలు చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
 
మత విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో అభిప్రాయాలు నమోదు చేయడం, ఫోటోలను, వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న వెబ్‌సైట్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం జూన్ నెల 29వ తేది ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు సూచించిన 40 వెబ్‌సైట్‌‌లలో ఇప్పటికే అనేక వెబ్‌సైట్‌లను నిషేధించారు. ఇంకా సాంకేతిక పరమైన కారణాల వలన కొన్ని వెబ్‌సైట్‌లు పని చేస్తూ వచ్చాయి. అయితే త్వరలోనే వాటిని కూడా నిషేధిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments