Webdunia - Bharat's app for daily news and videos

Install App

500 కోసం వెళ్లి... 10 వేలు జరిమానా కట్టారు... ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (09:28 IST)
కరువు కాలంలో నాలుగు రూకలు వస్తాయనుకుంటే.. అసలుకే ఎసరొచ్చిపడింది. లాక్‌డౌన్ నేపథ్యంలో జన్‌ధన్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిన రూ. 500 తీసుకునేందుకు వెళ్లిన మహిళలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో జరిగింది.

ప్రభుత్వం జమ చేసిన రూ. 500 తీసుకునేందుకు వెళ్లిన మహిళలు బ్యాంకు బయట క్యూ కట్టారు. విషయం తెలిసిన పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని భౌతిక దూరం పాటించాలని కోరారు.

అయినా వారు పట్టించుకోకపోవడంతో 39 మంది మహిళలను అదుపులోకి తీసుకుని జీపెక్కించారు. మహిళలకు సామాజిక దూరం పాఠాలు చెప్పిన పోలీసులు మాత్రం అందరినీ ఒకే జీపులోకి ఎక్కించి భౌతిక దూరం పాటించాలన్న విషయాన్ని మరిచారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది.
 
మహిళలపై సెక్షన్ 151  సెక్షన్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అందరినీ జైలుకు తరలించారు. విషయం తెలిసిన వారి భర్తలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. రూ. 10 వేల చొప్పున జరిమానా చెల్లించి  కోర్టు నుంచి బెయిలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments