Webdunia - Bharat's app for daily news and videos

Install App

మడ్ బాత్ మసాజ్ పేరుతో మభ్యపెట్టి.. భర్త ఎదుటే బ్రిటన్ మహిళపై అఘాయిత్యం

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (09:59 IST)
గోవాలో బ్రిటన్‌కు చెందిన మహిళపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. గోవా సముద్ర పర్యాటక అందాలు తిలకించేందుకు వచ్చిన బ్రిటన్‌ మహిళను శరీర మర్దన చేసే నెపంతో స్థానిక యువకుడు ఒకరు ఆమె ప్రియుడి ముందే అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఉత్తర గోవా జిల్లాలోని అరంబోల్‌ బీచ్‌ వద్ద విన్సెంట్‌ సహా మరికొందరు అనుమతి లేకుండా మసాజ్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మధ్యవయస్కురాలైన బ్రిటిష్‌ మహిళ తన భర్తతో కలసి ఈ నెల 2న బీచ్‌ సమీపంలోని స్వీట్‌ వాటర్‌ సరస్సు వద్దకు వచ్చింది. ఆ సమయంలో విన్సెంట్‌ మసాజ్‌ చేయించుకోవాలని కోరగా వారు అంగీకరించారు. 
 
ఆ తర్వాత బాధితురాలికి మర్దన చేస్తున్నట్లు నటిస్తూ ప్రియుడి ముందే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణాన్ని ఆ మహిళ బ్రిటన్‌లోని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. భారత్‌లోని బ్రిటిష్‌ ఎంబసీ సహాయాన్ని అర్థించింది. వారి సూచన మేరకు సోమవారం పెర్నెమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మసాజ్ పేరుతో అత్యాచారానికి పాల్పడిన నిందితుడు విన్సెంట్‌ డిసౌజా(32)ను అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండుకు తరలించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments