గోవా బస్సుల్లో సన్నీ లియోన్ కండోమ్స్ ప్రకటన గోవా అసెంబ్లీలో రచ్చరచ్చ చేసింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... శృంగార తార సన్నీ లియోన్ ప్రమోట్ చేస్తూ వున్న ఓ కండోమ్స్ ప్రొడక్ట్ తాలూకు పోస్టర్లు గోవా ప్రభుత్వ బస్సుల్లో దర్శనమీయడం చర్చనీయాంశంగా మారింది.

బస్సులు ఎక్కిన మహిళలు చీర చెంగులను, చున్నీలను కళ్లకు అడ్డుగా పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనితో గోవా ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. కదంబ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కార్ప్ బస్సుల్లో సన్నీ లియోన్ నటించిన కండోమ్ ప్రకటన పోస్టర్‌లు అతికించడం ఏంటి అధ్యక్షా అంటూ ప్రశ్నించింది.
అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్‌టీ ఆడ్రూ ఫ్రాన్స్ సిల్వెయిరా మాట్లాడుతూ.. అధ్యక్షా... ఈ సభలో కండోమ్స్ అనే పదం వాడవచ్చా అని అడిగి మరీ చర్చ లేవనెత్తారు. గోవా ప్రభుత్వ బస్సుల్లో సన్నీ లియోన్ కండోమ్స్ ప్రకటన తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన సూచనల మేరకు ఆ ప్రకటన తొలగించే పనిలో ప్రభుత్వం వున్నట్లు తెలుస్తోంది.