Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 వేల మంది అమ్మాయిలను అమ్మారు... రూ.100 కోట్లు సంపాదించారు!

ఢిల్లీ పోలీసులు అమ్మాయిల అక్రమ రవాణా, హైటెక్ వ్యభిచార రాకెట్‌ను నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాకు సంబంధించి ఆగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (15:10 IST)
ఢిల్లీ పోలీసులు అమ్మాయిల అక్రమ రవాణా, హైటెక్ వ్యభిచార రాకెట్‌ను నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాకు సంబంధించి ఆగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఢిల్లీతో పాటు.. బీహార్, ఒడిషా, బెంగాల్, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను అక్రమంగా తరలించి, వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. 
 
ఈ నిఘాలో హుస్సేన్ (50), సైరా (45) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద జరిపిన విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఇద్దరు వ్యక్తులు కొంతమంది అమ్మాయిలను ఢిల్లీకి అక్రమంగా తరలించి.. ఒక్కో అమ్మాయిని రూ.2 లక్షల చొప్పున అమ్ముతూ వస్తున్నట్టు వెల్లడించారు. ఇలా ఇప్పటివరకు రూ.వంద కోట్ల మేరకు అర్జించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 
 
హుస్సేన్ డ్రైవర్ రమేష్, చీఫ్ మేనేజర్ వాసులను కూడా ఇప్పటికే అరెస్టు చేశారు. వాళ్లతోపాటు శంషద్, శిల్పి, ముంతాజ్, పూజా థాపా అనే నలుగురు అమ్మాయిలను హ్యాండిల్ చేసే 'నాయికలు'గా ఉండేవారు. వాళ్లు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. దీనిపై పోలీసులు మరింతలోతుగా విచారణ జరుపుతున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం