Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ విధించినా.. ఆగని అత్యాచారాలు.. కాటేస్తున్న కామాంధులు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (09:49 IST)
కరోనా మహమ్మారి లాంటి వ్యాధులు భయపెడుతున్నా.. దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. లాక్ డౌన్ విధించినా.. పోలీసుల భద్రత పటిష్టంగా వున్నా.. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. గుంటూరులో చిన్నారిపై అత్యాచారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన మరియానందం (48) అత్యాచారానికి ఒడిగట్టాడు. 
 
బాలిక తండ్రి మూడేళ్ల కిందట చనిపోయాడు. తల్లి కూలీ పనులు చేస్తూ ముగ్గురు కూతుళ్లు, కొడుకుని పోషిస్తోంది. గురువారం(ఏప్రిల్ 23,2020) మధ్యాహ్నం బాలిక ఇంట్లో వారంతా మిర్చి కోతలకు వెళ్లారు. బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఇదే అదనుగా మరియానందం బాలికను బలవంతంగా తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
మధ్యాహ్నం పనులకు వెళ్లి వచ్చిన తల్లికి బాలిక విషయాన్ని తెలిపింది. తల్లి ఫిర్యాదు మేరకు నకరికల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మరియానందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments