Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ బొమ్మతో కరెన్సీ.. గాంధీ బ్రాండ్‌‌తో ఖాదీ విలువ మటాష్ : అనిల్ విజ్

హర్యానా రాష్ట్రానికి చెందిన అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతిపితి మహాత్మా గాంధీ బొమ్మ వల్ల దేశ కరెన్సీ విలువ పడిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, గాంధీ బ్రాండ్‌ వల్ల ఖాదీ వస్త్రాల వి

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (05:21 IST)
హర్యానా రాష్ట్రానికి చెందిన అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతిపితి మహాత్మా గాంధీ బొమ్మ వల్ల దేశ కరెన్సీ విలువ పడిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, గాంధీ బ్రాండ్‌ వల్ల ఖాదీ వస్త్రాల విలువ కూడా తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు. పైగా, మహాత్మా గాంధీ కన్నా ప్రధాని నరేంద్ర మోడీయే 'మంచి బ్రాండ్' అని వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ "ఖాదీపై గాంధీ పేరుకేమీ పేటెంట్‌ లేదు. ఖాదీకి గాంధీ పేరును లింకు చేసినప్పటి నుంచే పరిశ్రమ పతనమైపోయింది. గాంధీ బొమ్మను కరెన్సీ నోట్లపై వేసినప్పటి నుంచి రూపాయి విలువ తగ్గడమే కానీ పెరగడం లేదు" అని విజ్‌ వ్యాఖ్యానించారు. 
 
ఖాదీ, కుటీర పరిశ్రమల కమిషన్‌ తాజా కేలండర్‌లో గాంధీకి బదులుగా మోదీ ఫొటో వేయడంపై వ్యక్తమైన విమర్శలకు మంత్రి స్పందించారు. ఖాదీ వస్త్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా గాంధీ స్థానంలో మోడీని పెట్టడం సరైన నిర్ణయమని చెప్పారు. కనీసం దానివల్ల ఖాదీ అమ్మకాలు పెరుగుతాయన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments