Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీని అగౌరవపరచడం వల్లే.. నా భర్త దాడి చేయాల్సి వచ్చింది.. గైక్వాడ్ భార్య

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ దురుసు ప్రవర్తనపై ఆయన సతీమణి ఉష వివరణ ఇచ్చారు. ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో దాడిచేసిన ఘటనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఉష లింకుపెట్టేశారు. గైక్వాడ్‌కు ఇంతగా కోపమొస్తుం

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (17:21 IST)
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ దురుసు ప్రవర్తనపై ఆయన సతీమణి ఉష వివరణ ఇచ్చారు. ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో దాడిచేసిన ఘటనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఉష లింకుపెట్టేశారు. గైక్వాడ్‌కు ఇంతగా కోపమొస్తుందనే విషయం తొలిసారిగా చూశామని.. ఎయిర్‌ ఇండియా ఉద్యోగులు దురుసుగా నోరుపారేసుకోవడం వల్లే.. తన భర్త అయిన గైక్వాడ్ చెప్పుతో దాడి చేయాల్సినంత కోపం వచ్చిందని ఉష తెలిపారు. మోడీని సైతం అగౌరవపరిచేలా ఎయిర్ ఇండియా ఉద్యోగి మాట్లాడటం వల్లే తన భర్త సహనం కోల్పోయినట్లు ఆరోపించారు.  
 
తన భర్త ఇతరులపై ఇలా చేజేసుకుంటారని తానెప్పుడూ ఊహించలేదు. ఎయిర్‌లైన్స్ నోరు పారేసుకోవడం వల్లే ఇదంతా జరిగిపోయిందని ఉష వివరణ ఇచ్చారు. గైక్వాడ్ ఇటీవల కుటుంబ సమేతంగా బంధువుల ఇంట జరిగే ఓ కార్యక్రమం కోసం పూణేకు వెళ్లారు. భార్య, కుమారుడు అక్కడే ఉండిపోవడంతో.. గురువారం గైక్వాడ్ ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. అదే రోజు సీటింగ్ విషయమై ఎయిరిండియా సిబ్బందికి, ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదం ఓ సీనియర్ సెక్యూరిటీ అధికారిపై గైక్వాడ్ చెప్పుతో దాడికి దారితీసింది.
 
దీనిపై ఎంపీ భార్య స్పందిస్తూ.. సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఎయిరిండియా సిబ్బందిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. తన భర్త ఇచ్చే కంప్లయింట్ తీసుకోకుండా వాదించడం మొదలు పెట్టారని ఉష ఆరోపించారు. ప్రధాన మంత్రిని అగౌరవపరచడమే ఈ దాడికి కారణమని ఉష నొక్కి చెప్పారు.

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments