Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అత్యంత శాంతి యుత ప్రాంతం ఇప్పుడు కాశ్మీర్ : జి. కిషన్ రెడ్డి

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (17:29 IST)
గణతంత్ర దినోత్సవం రోజున భారత మాతకు హారతి ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ నగరంలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబురాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషన్ రెడ్డి దేశంలోపల, సరిహద్దుల్లో జరుగుతున్న సంఘటనల దృష్ట్యా దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. 
 
మతం, ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందని దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన అందరిమీద ఉందన్నారు. అనవసరంగా ఒక మతాన్ని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద చెడు అభిప్రాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈనెల 18 నుంచి 24 వ తేదీ వరకు కేంద్ర మంత్రులు జమ్మూ కాశ్మీర్‌లలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు.
 
స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి కేంద్ర మంత్రులు కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అంతేకాదు రాత్రి అక్కడ గ్రామాల్లో బస చేస్తారని తెలియజేశారు. దేశంలో అత్యంత శాంతి యుత ఏదైనా ఉందా అంటే ? అది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఒక్కటేనని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments