Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసుల చేతిలో షీనా బోరా డైరీ.. ఇంద్రాణి అమ్మే కాదు.. అదో పెద్ద దెయ్యం..

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (15:36 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న షీనా బోరా హత్య కేసులో మరో కీలక సాక్ష్యం పోలీసులకు చిక్కింది. తన తల్లి ఇంద్రాణి ముఖర్జియా గురించి షీనా బోరా ఈ డైరీలో అనేక విషయాలను రాసింది. ముఖ్యంగా తమ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాల గురించి అందులో రాసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ డైరీలోని విషయాల ఆధారంగా ఇంద్రాణి వద్ద మరోమారు ప్రశ్నించాలని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. 
 
ఇంద్రాణి రెండో మాజీ భర్త సంజీవ్ ఖన్నాను కోల్‌కతాలో అరెస్టు చేసిన తర్వాత ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఆ సమయంలో ఈ డైరీ బయటపడింది. ఇందులో షీనా బోరా తన స్వీయ దస్తూరితో ఈ డైరీని రాసుకున్నట్టు పోలీసులు తేల్చారు. 'నన్ను అన్ని వైపుల నుంచి ఒత్తిడి చుట్టుముట్టింది. ఈ జీవితమే వృథా అన్నట్టుంది. నా తల్లిని నేను ద్వేషిస్తున్నాను. ఆ దుర్మార్గపు తల్లి...., ఆమె అసలు నా అమ్మే కాదు. అదో పెద్ద దెయ్యం...' అని రాసింది. 
 
దశాబ్దకాలం క్రితమే తన తల్లి ఇంద్రాణి గురించి షీలా తన డైరీలో ఇలా ఎందుకు రాసిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే, ఫిబ్రవరి 11, 2003 తేదీతో ఉన్న ఎంట్రీలో "ఓహ్... నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు! ఏమీ లేదు... నా భవిష్యత్ అంధకారంగా ఉంది" అని షీనా రాసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడీ డైరీని పూర్తిగా విశ్లేషించి, అందులోని వివరాల ప్రకారం మరోసారి ఇంద్రాణిని ప్రశ్నించాలని ముంబై పోలీసులు భావిస్తున్నారు.

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రెండు భాగాలు, మూడు పాత్రల టీనేజ్ లవ్ స్టోరీతో ఎస్ కే ఎస్ క్రియేషన్స్ చిత్రం

సమంత, రాజ్ & డికె లాంచ్ చేసిన అనుపమ పరమేశ్వరన్ 'పరదా' ఫస్ట్ లుక్

ఆడ పిల్లనే అయితే ఏంటట ? అంటూ ప్రశ్నిస్తున్న పోలీస్‌ఆఫీసర్‌ చాందిని చౌదరి యేవమ్‌ లుక్‌

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments