Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే చితిపై 8 మంది కరోనా మృతులకు అంత్యక్రియలు

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:57 IST)
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ.. ఒకే చితిపై 8 మంది కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. దేశంలో నమోదవుతున్న అత్యధిక కేసుల్లో 50 శాతం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.

ఈ క్రమంలో మంగళవారం మహారాష్ట్రలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో కరోనాతో ఎనిమిదిమంది మరణించారు. అంబాజ్‌గారు పట్టణంలోని స్మశాన వాటికలో వారి అంత్యక్రియలను నిర్వహించాలని అధికారులు భావించారు.

అయితే ఆ మృతదేహాలు కరోనా బారినపడి మరణించినవారివి కావటంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని మరో స్మశానవాటికకు మృతదేహాలను తరలించి అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

అక్కడ స్థలం సరిపడ లేకపోవడంతో ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ లాంచ్ చేసిన బాపు నుంచి అల్లో నేరేడల్లో పిల్లా సాంగ్

స్ట్రైట్ సాంగ్ కంటే డబ్బింగ్ సాంగ్ రాయడం కష్టం ఫ గీత రచయిత కేకే (కృష్ణకాంత్)

అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ విజన్ గ్రేడింగ్ చూసి థ్రిల్ అయ్యా : SS రాజమౌళి

ఎవరికి గేమ్ ఛేంజర్ అవుతుంది...రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments