7 నుంచి విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు

Webdunia
సోమవారం, 4 మే 2020 (20:01 IST)
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్‌లో లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో విదేశీ రాకపోకలపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఉపాధి కోసం, ఉద్యోగ నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లి భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్న భారతీయులకు కేంద్రం తాజాగా శుభవార్త చెప్పింది.
 
మే 7 నుంచి విదేశాల నుంచి వచ్చే భారతీయుల కోసం విమానాలు, నౌకలు నడపనున్నట్లు కేంద్రం ప్రకటించింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల జాబితాను భారతీయ ఎంబసీలు, హై కమిషన్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.

అయితే.. ఈ విమానాలు, నౌకల్లో రావాలనుకునే భారతీయులు రవాణా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు, మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించిన అనంతరం.. కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

అయితే.. మే 7 నుంచి దశల వారీగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments