Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచార బాధితురాలిపై నాలుగోసారి యాసిడ్ దాడి...

తొమ్మిదేళ్ళ క్రితం అత్యాచారానికిగురై కుమిలిపోతున్న ఓ బాధితురాలిపై దుండగులు నాలుగో సారి యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... రాయ్‌బరేలిలోని ఓ

Webdunia
ఆదివారం, 2 జులై 2017 (16:29 IST)
తొమ్మిదేళ్ళ క్రితం అత్యాచారానికిగురై కుమిలిపోతున్న ఓ బాధితురాలిపై దుండగులు నాలుగో సారి యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... రాయ్‌బరేలిలోని ఓ గ్రామానికి చెందిన 31 ఏళ్ల వివాహితకి ఇద్దరు పిల్లలు. 2008లో ఆమె తన స్వగ్రామంలో ఉన్నప్పుడు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఇద్దర్ని పోలీసులు అరస్ట్‌ చేశారు. 
 
ఆ తర్వాత 2011లో ఆమెపై యాసిడ్‌ దాడి జరిగింది. ఈ ఘటన నుంచి తేరుకోకుండానే 2013లో మరోసారి యాసిడ్‌ దాడి జరిగింది. అప్పటి నుంచి ఆమె అలిగంజ్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ యాసిడ్‌ దాడి బాధితుల కోసం ఏర్పాటు చేసిన కేఫ్‌లో పనిచేస్తోంది. ఈ ఏడాది మార్చిలో బాధితురాలు రైలులో లక్నోలో వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు మహిళపై యాసిడ్‌ దాడి చేశారు. అప్పుడు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆమెను హాస్పిటల్‌లో పరామర్శించి పరిహారం కూడా చెల్లించారు. యాసిడ్‌ దాడికి పాల్పడినవారిని అరెస్ట్‌ చేశారు.
 
తన జీవితంలో ఇన్ని దారుణ ఘటనలు చోటుచేసుకున్నా ఆత్మస్థైర్యం కోల్పోకుండా తన బతుకేదో తాను బతుకుంటే నాలుగోసారి ఆమెపై యాసిడ్‌ దాడి జరిగింది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో నీళ్లు పట్టుకోవడానికి ఆమె బయటికి వచ్చినప్పుడు కొందరు వ్యక్తులు బైక్‌పై వచ్చి యాసిడ్‌ పోసి పరారయ్యారు. ఈ ఘటనలో కుడి వైపు ముఖం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై లక్నో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments