Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం కష్టమో... బీజేపీ నేత ఇంట్లో నలుగురి ఆత్మహత్య

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (10:21 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం విషాదం నింపింది. ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని సికార్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇటీవల తమ కుటుంబ సభ్యుడ్ని కోల్పోయిన బాధతోనే బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. మృతులను హనుమాన్ ప్రసాద్ సైనీ, మదన్‌లాల్‌ భార్య తారా, ఇద్దరు కుమార్తెలు అంజు, పూజలుగా గుర్తించారు.  
 
మదన్ లాల్ గత ఏడాది సెప్టెంబరులో పెద్ద కుమారుడిని కోల్పోయారు. దీంతో కుటుంబంలోని వారంతా తీవ్ర మానసిక వ్యధకు లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. 
 
మదన్ లాల్‌‌ సోదరుని కుమారుడు హనుమాన్ ప్రసాద్ సైనీ రాసినదిగా భావిస్తున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ పెద్ద కుమారుడు మృతి చెందిన తర్వాత బతకాలనే ఆశలేదంటూ ప్రసాద్‌ ఈ లేఖలో పేర్కొన్నారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి వీరేంద్ర శర్మ తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments