చెన్నైలో నలుగురి ప్రాణాలు తీసిన రైల్ ఫుట్‍బోర్డు ప్రయాణం...

'ఫుట్‌బోర్డు ప్రయాణం.. ప్రమాదకరం' అని వాళ్లకు తెలుసు. అయినా కూడా.. ఉన్నది ఒక్కటే రైలు కావడంతో ఫుట్‌బోర్డుపైనే ఎక్కారు. రద్దీ ఎక్కువ అవడంతో ఫుట్‌బోర్డు మీదే దాదాపు పది నుంచి పదిహేను మంది వేలాడుతూ ప్రయా

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (14:07 IST)
'ఫుట్‌బోర్డు ప్రయాణం.. ప్రమాదకరం' అని వాళ్లకు తెలుసు. అయినా కూడా.. ఉన్నది ఒక్కటే రైలు కావడంతో ఫుట్‌బోర్డుపైనే ఎక్కారు. రద్దీ ఎక్కువ అవడంతో ఫుట్‌బోర్డు మీదే దాదాపు పది నుంచి పదిహేను మంది వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. ఎలాగైనా త్వరితగతిన గమ్యానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రమాదకర ప్రయాణం చేస్తున్న వారికి మార్గమధ్యలోనే మృత్యువు ఎదురైంది. గమ్యం చేరకుండానే వారి జీవితాలను కబలించి వేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలో మంగళవారం ఉదయం జరిగిన విషాద ఘటన ఇది.
 
ఈ దుర్ఘటన మంగళవారం ఉదయం చెన్నై సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో చెన్నై బీచ్‌-తిరుమాల్‌పూర్‌ లోకల్‌ రైలులో జరిగింది. రైలు బాగా రద్దీగా ఉండటంతో కొంతమంది ప్రయాణికులు ఫుడ్ బోర్డుపై నిల్చుని ప్రయాణిస్తున్నారు. సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రైల్వేస్టేషన్‌ రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తుండగానే కరెంట్ పోల్‌ను వారు ఢీకొట్టారు. దీంతో ఫుట్‌బోర్డులో ఉన్న ప్రయాణికులంతా కిందపడిపోయారు. ఇందులో నలుగురు అక్కడి కక్కడే చనిపోగా… మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి రైల్వే అధికారులు తరలించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments