Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఐ17వి5 హెలికాఫ్టర్ ప్రమాదానికి అదే కారణమా?

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (08:12 IST)
దేశ వ్యాప్తంగా విషాదం నింపిన హెలికాఫ్టర్ ప్రమాదానికి గల కారణాలను పలువురు విధాలుగా చెబుతున్నారు. అయితే, స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు, రక్షణ రంగ నిపుణులు మాత్రం మరోలా అభిప్రాయపడుతున్నారు. హెలికాఫ్టర్ ప్రమాదం జరిగిన ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతం. పైగా, దట్టంగా పొగమంచు అలుముకునివున్నది. ఈ పొగ మంచే హెలికాఫ్టర్ ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్నది పలువురు అభిప్రాపడుతున్నారు. 
 
ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఊటీ ఉన్న జిల్లా నీలగిరి. ఈ ప్రాంతంలో సాధారణంగానే మంచుదుప్పటి ఉంటుంది. పైగా, మంచుకాలంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇటీవల నీలగిరి జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు తగ్గిపోవడంతో ఇపుడు పొగమంచు కూడా ఎక్కువైంది. ఈ కారణంగానే ఈ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. 
 
ఈ విషయాన్ని స్థానికులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. మరికొద్దిసేపట్లో వెల్లింగ్టన్‌కు చేరుకోవాల్సివున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్, ఆయన అర్థాంగి మధులిక రావత్, మరో 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments