Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర అప్పులు రూ.155 లక్షల కోట్లు - విదేశీ రుణాలు 4.5 శాతం

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (12:34 IST)
కేంద్ర ప్రభుత్వ అప్పులను విత్తమంత్రి నిర్మలా సీతామన్ తాజాగా వెల్లడించారు. 2023 మార్చి నాటికి మొత్తం రుణాలు రూ.155.8 లక్షల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. ఇది డీజీపీలో 57.3 శాతంతో సమానమని వివరించారు. ఇందులో విదేశీ అప్పు తాజా మారకద్రవ్య విలువ ప్రకారం రూ.7.03 లక్షల కోట్లని ఇది జీడీపీలో 2.6 శాతంగా ఉందని తెలిపారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ రెండో విడత పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, భారత రాష్ట్ర సమితి సభ్యుడు నామా నాగేశ్వర రావు అడిగిన ప్రశ్నకు ఆమె లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మొత్తం రుణాల్లో విదేశీ అప్పు 4.5 శాతమేనని తెలిపారు. విదేశీ రుణాలను సాధారణంగా బహుముఖ, ద్వైపాక్షిక సంస్థలు రాయితీ రేటుతో ఇస్తుంటాయని చెప్పారు. అందువల్ల ఇందులో ముప్పు ఏమీ ఉండదని పేర్కొన్నారు.
 
మరోవైపు ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, దేశ వ్యాప్తంగా ఉండే ఏటీఎం యంత్రాల్లో రూ.2 వేల నోట్లను నింపొద్దని బ్యాంకులకు ఆర్థిక శాఖ చెప్పలేదని తెలిపారు. ఏటీఎంలలో ఏ నోట్లు ఎంత సంఖ్యలో పెట్టాలన్న విషయమై బ్యాంకులు సొంత అంచనా వేసుకొని నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. అక్కడ వినియోగదారుల అవసరాలు, సీజనల్‌ ట్రెండ్‌ను బట్టి అవి దీనిపై నిర్ణయం తీసుకుంటాయన్నారు. అయితే, గత 2019-20 తర్వాత రూ.2 వేల నోట్ల ముద్రణ కోసం ఆర్‌బీఐ ఎలాంటి ఇండెంట్‌ పెట్టలేదని ఆమె స్పష్టం చేశారు. అంటే ప్రస్తుతం రూ.2 వేల నోటు ముద్రణ నిలిపివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments