Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ రైలులో విమాన సౌకర్యాలు...

రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో ఓ శుభవార్త తెలిపింది. శతాబ్ది, దురంతో వంటి రైళ్లలో విమానంలో ఉండే సౌకర్యాలను కల్పించనున్నట్టు వెల్లడించింది. అంతేనా ఈ తరహా సౌకర్యాలను తొలిసారి శతాబ్ది ఎక

Webdunia
శుక్రవారం, 12 జనవరి 2018 (12:30 IST)
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో ఓ శుభవార్త తెలిపింది. శతాబ్ది, దురంతో వంటి రైళ్లలో విమానంలో ఉండే సౌకర్యాలను కల్పించనున్నట్టు వెల్లడించింది. అంతేనా ఈ తరహా సౌకర్యాలను తొలిసారి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రవేశపెట్టారు. ఈ రైలు చెన్నై సెంట్రల్ - మైసూరు ప్రాంతాల మధ్య నడుస్తోంది. 
 
ఈ రైలులో ప్రతి సీటుకు ఇన్ఫోటెయిన్‌మెంట్ తెరలు, యూజర్ ఫ్రెండ్లీ స్నాక్ టేబుల్, సౌకర్యవంతమైన సీట్, రెక్నినింగ్ సదుపాయాలను కల్పించారు. అలాగే, టాయిలెట్లను హ్యాండ్స్-ఫ్రీ పీపాలోహిత వ్యవస్థతో అమర్చారు. రైలు బోగీ తలుపులకు ఆటోమేటెడ్ సెన్సార్-ఎనేబుల్ చేశారు. ప్రయాణికుల సీట్ల వద్ద కాలింగ్ బెల్‌తో పాటు విలాసవంతమైన సౌకర్యాలు రైలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. 
 
ప్రత్యేకంగా రూ.3 కోట్ల వ్యయంతో కూడిన కోచ్‌ను ప్రయాణికులకు విమాన సదుపాయాలతో పెరంబూర్ సమీకృత కోచ్ ఫ్యాక్టరీ (ఇటెంగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ -ఐసీఎఫ్)లో నిర్మించారు. చెన్నై నుంచి మైసూరు వెళ్లే ఈ రైలుకు శుక్రవారం నుంచి పచ్చజెండా ఊపారు. ఈ సౌకర్యాలతో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments