Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతా బెనర్జీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. దుర్గాపూజ సెలవులతో?

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (17:23 IST)
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నబన్నాలోని సచివాలయం 14వ అంతస్తులో ఉన్న సీఎం మమతా కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి.
 
కార్యాలయంలో నుంచి పొగలు రావడం గమనించిన ప‌క్క‌నే గ్రౌండ్‌లో పని చేస్తున్న కార్మికులు.. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. స‌మాచారం అందిన వెంట‌నే అగ్నిమాపక దళం, ఎన్‌డీఆర్‌ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
 
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. దుర్గాపూజ సందర్భంగా సెలవు కారణంగా సచివాలయాన్ని మూసివేశారు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments