Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారుడిని చంపేసినా దోషులను వదిలిపెట్టేయమన్న తండ్రి.. వారు కూడా..?

తన కుమారుడిని హతమార్చిన దోషులను ఓ తండ్రి పెద్ద మనసుతో వదిలిపెట్టేయాల్సిందిగా కోర్టును విజ్ఞప్తి చేసుకున్నాడు. తన బిడ్డ ఎలాగో ఇక తిరిగిరాలేడు.. నిందితులు దోషులని తేలినప్పటికీ వారు కూడా తన కొడుకుల్లాంటి

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (12:57 IST)
తన కుమారుడిని హతమార్చిన దోషులను ఓ తండ్రి పెద్ద మనసుతో వదిలిపెట్టేయాల్సిందిగా కోర్టును విజ్ఞప్తి చేసుకున్నాడు. తన బిడ్డ ఎలాగో ఇక తిరిగిరాలేడు.. నిందితులు దోషులని తేలినప్పటికీ వారు కూడా తన కొడుకుల్లాంటి వారేనని.. వారిని విడిచిపెట్టేయాలని ఓ తండ్రి క్షమాగుణాన్ని చాటుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో రాహుల్, సంజీవ్, దీపక్, రాజాలు గ్రామ సేవ వాహనాల డ్రైవర్లు. పార్కింగ్ గొడవ కారణంగా గత ఏప్రిల్ 28, 2012లో సన్నీ అనే మరో డ్రైవర్‌తో గొడవకు దిగారు. ఈ గొడవ కాస్త దాడికి దారితీసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సన్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదనలు కోర్టులో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దోషులు నలుగురు హత్యకు గురైన యువకుడి తండ్రిని క్షమాపణలు వేడుకున్నారు. అతడు కూడా క్షమించాడని కోర్టు పేర్కొంది. దోషులను వదిలిపెట్టేయాలని మృతుడి తండ్రి చేసిన అభ్యర్థనను మన్నించిన కోర్టు ప్రోబేషన్‌పై నలుగురు దోషులను వదిలిపెట్టింది. వారికి ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష పడాల్సి ఉండగా అతడి క్షమాభిక్షతో బయటపడ్డారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments