Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిది స్నేహమా? అక్రమ సంబంధమా? భర్త స్నేహితుడిని ఎందుకు కాల్చేశాడు.. భార్య సూసైడ్ ఎందుకు?

వివాహానికి తర్వాత మహిళలు భర్తతో కాకుండా ఇతరులతో ఏర్పరుచుకునే స్నేహం హద్దులు మీరకుండా ఉంటే బెటర్. ఎందుకంటే.. స్నేహితులతో సంబంధాల కారణంగా ఏర్పడే అనుమానాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. అలాంటి ఘటనే బెంగళూరు

Webdunia
ఆదివారం, 15 జనవరి 2017 (16:49 IST)
వివాహానికి తర్వాత మహిళలు భర్తతో కాకుండా ఇతరులతో ఏర్పరుచుకునే స్నేహం హద్దులు మీరకుండా ఉంటే బెటర్. ఎందుకంటే.. స్నేహితులతో సంబంధాల కారణంగా ఏర్పడే అనుమానాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. అలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. దక్షిణ బెంగళూరులోని కగ్గళిపురలో ఉంటున్న శ్రుతి గౌడ (32) ఇద్దరు పిల్లల తల్లి. రైల్వే గొల్లహళ్ళిలో పంచాయతీ అభివృద్ధి అధికారిణిగా పనిచేస్తోంది. ఆమె భర్త రాజేశ్ గౌడ (33). వీరిది సంపన్న కుటుంబమే. అమిత్ కేశవమూర్తి (34) న్యాయవాది, రాజకీయ నాయకుడు. ఈ రెండింటి కుటుంబాల మధ్య సంబంధాలున్నాయి. 
 
ఇటీవలే కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్నారు. కానీ ఇంతలోనే అమిత్ దారుణంగా హత్యకు గురయ్యాడు, అది చూసి శ్రుతి ఆత్మహత్య చేసుకుంది. అందుకు కారణం వీరిద్దరి మధ్య ఏర్పడిన బంధం గురించి శ్రుతి భర్త రాజేష్, ఆయన తండ్రి గోపాలకృష్ణ అనుమానించడమేనని తెలిసింది.

ఈ క్రమంలో శుక్రవారం శ్రుత కారులో బయల్దేరింది. తుమకూరు రోడ్‌లోని మదనాయకనహళ్ళిలో అమిత్‌ను ఆ కారులో ఎక్కించుకుంది. కొంత దూరం వెళ్ళాక కథ అడ్డం తిరిగింది. రాజేశ్, గోపాలకృష్ణ వేరొక కారులో వీరిద్దర్నీ వెంబడించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
వీరిద్దర్నీ బయటకు రమ్మని రాజేశ్ గద్దించాడని అంటున్నారు. గోపాలకృష్ణ వద్ద లైసెన్స్‌డ్ తుపాకీ ఉంది. ఆ తుపాకీ నుంచి రెండు తూటాలు అమిత్ ఛాతీలో దిగాయి. అయితే ట్రిగ్గర్‌ను ఎవరు నొక్కారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. అమిత్ హత్యను చూసిన శ్రుతి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ లోని సాంగ్ కు డాన్స్ చేసిన గౌతమ్ వాసుదేవ మీనన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments