Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు ప్రేమలేఖ: అమ్మ ఎలాంటి సమాధానమిచ్చారో తెలుసా? అమ్మో.. ఫ్యాన్ షాకైవుంటాడా?

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రేమ లేఖ రాసే అభిమానుల సంఖ్య అప్పట్లో చాలా ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. హీరోయిన్‌గా జయలలిత ఓ ఊపులో ఉన్నప్పుడు జయలలితకు ఫ్యాన్స్ వెల్లువల్లా ప్రేమలేఖలు రాసేవారు. ఈ విష

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (17:31 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రేమ లేఖ రాసే అభిమానుల సంఖ్య అప్పట్లో చాలా ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. హీరోయిన్‌గా జయలలిత ఓ ఊపులో ఉన్నప్పుడు జయలలితకు ఫ్యాన్స్ వెల్లువల్లా ప్రేమలేఖలు రాసేవారు. ఈ విషయాన్ని జయలలిత ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమా, రాజకీయ రంగాల్లో తనకంటూ ఓ స్థానాన్ని కైవసం చేసుకున్న జయలలితను చూస్తేనే.. ప్రభుత్వాధికారులైన పురుషులు జడుసుకునేవారు. కానీ ఆమెకు లవ్ లెటర్స్ రాసే వారూ ఉన్నారు. 
 
వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నట్లు జయలలిత ఎన్నో సందర్భాల్లో స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమా రంగంలో ఉన్నప్పుడు ఓ ఫ్యాన్ తనకు ప్రేమ లేఖ రాశాడని చెప్పారు. ఆ ప్రేమలేఖలో జయను అతడు ప్రేమిస్తున్నట్లు రాశాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడట. మీరు ఓకే చెప్పకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. డెడ్ లైన్ కూడా పెట్టాడు.. అంటూ జయమ్మ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. 
 
ఈ లేఖకు జయలలిత సమాధానం ఇస్తూ లేఖ రాయనేలేదట. ఆపై డెడ్ లైన్ విధించిన తేదీ ముగిశాక.. అదే అభిమాని నుంచి మరో లేఖ అందిందట. అందులోనూ ఆ ఫ్యాన్ చనిపోతానని బెదిరించాడట. కానీ ఆపై జయలలిత ఆ లేఖకు సమాధానమిస్తూ ఓ లేఖ రాశారట. అందులో తనకు భర్తగా వచ్చే వ్యక్తి చెప్పిన మాటపై నిలబడాలని రాశారు. అయితే నువ్వు (ఫ్యాన్) ఇంతకుముందు పంపిన లేఖలో ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారం నడుచుకోలేదు. 
 
అలాంటప్పుడు ఎలా మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటారు... అంటూ లేఖలో జయలలిత నిలదీసినట్లు చెప్పుకొచ్చారు. అలా సమాధానం ఇచ్చిన తర్వాత ఆ ఫ్యాన్ నుంచి ఎలాంటి లేఖ జయమ్మ అందలేదట. దీనిని బట్టి జయలలిత ఎంత బుద్ధిమంతురాలు.. సమయోచితంగా ప్రవర్తించే తీరేంటో అర్థం చేసుకోవచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగా ఫ్యామిలీ హీరోలకు 'పుష్పరాజ్' దూరమైనట్టేనా? చెర్రీ అన్‌ఫాలో..

నటుడు పృధ్వీ ఆసుపత్రి పాలు కావడానికి వారే కారణం !

బద్మాషులు మన ఊరి కథ : రచ్చరవి

సుబ్రమణ్యేశ్వర స్వామియే నన్ను పిలిపించుకున్నారు :విశ్వక్సేన్

నేను స్ట్రగుల్ లో వున్న టైమ్ లో అమ్మ రాజశేఖర్ కు ఏమైంది అన్న వారికి సమాధానం తల మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments