Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గుతున్న బంగారం ధర

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (08:54 IST)
బంగారం ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర దారిలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది. హైదరాబాద్‌ మార్కెట్లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.51,410కి చేరింది.

అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు రూ.90తగ్గి రూ.47,130కి చేరింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజి వెండి ధర ఏకంగా రూ.1000 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.61,500కి చేరింది.

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పైకి కదిలింది.

బంగారం ఔన్స్‌కు 0.17శాతం పెరుగుదలతో 1908డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.47శాతం పెరుగుదలతో 24.53డాలర్లకు చేరింది. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments