Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చూస్తూవుంటా.. మీరు శృంగారం చేయండి... పిల్లలు పుడతారు.. థానేలో దొంగబాబా సలహా

మహారాష్ట్రలోని థానేలో ఓ దొంగబాబా లీలలు వెలుగులోకి వచ్చాయి. వివాహమై కొన్నేళ్ళు గడిచినా పిల్లలు పుట్టని ఓ జంటను ఆ దొంగబాబా ఎలా మోసం చేశాడన్నది తాజాగా వెలుగులోకి వచ్చింది.

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (11:45 IST)
మహారాష్ట్రలోని థానేలో ఓ దొంగబాబా లీలలు వెలుగులోకి వచ్చాయి. వివాహమై కొన్నేళ్ళు గడిచినా పిల్లలు పుట్టని ఓ జంటను ఆ దొంగబాబా ఎలా మోసం చేశాడన్నది తాజాగా వెలుగులోకి వచ్చింది. తాను చూస్తుండగా శృంగారంలో పాల్గొంటే మీకు పిల్లలు పుడతారని చెప్పడమే కాకుండా, వారితో అలా చేయించాడు కూడా. ఆ తర్వాత తాను కూడా ఆ మహిళతో శృంగారం చేసేందుకు ప్రయత్నించి.. కటకటాల పాలయ్యాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మహారాష్ట్ర, థానేలోని సర్వర్కర్ నగర్‌కు చెందిన 29 ఏళ్ల మహిళకు చాలా సంవత్సరాల క్రితం పెళ్లయింది. అయితే పెళ్లయి ఇన్నాళ్లయినా పిల్లలు లేకపోవడంతో తమ ప్రాంతంలో ఉండే ఓ బాబా దగ్గరకు వెళ్లి.. తన సమస్యను చెప్పుకుంది. దీనికి పరిష్కార మార్గం సూచించమని బాబాను ఆశ్రయిస్తే భర్తతో కలిసి రావాలని సూచించాడు. 
 
దీంతో ఆమె తన భర్తను వెంటబెట్టుకుని బాబా దగ్గరకు ఆ మహిళ వచ్చింది. కొద్దిసేపు ఏవేవో పూజలు చేశాక.. తాను చూస్తుండగా శృంగారంలో పాల్గొనాలని సలహా ఇచ్చాడు. ఇది విన్న ఆ దంపతులకు దిమ్మతిరిగినంతపనైంది. తన ముందు శృంగారం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారని నమ్మపలికాడు.
 
పిల్లలపై ఎంతో ఆశపెట్టుకున్న ఆ జంట.. స్వామీజీ చూస్తుండగా... శృంగారంలో పాల్గొన్నారు. కొద్దిసేపటి తర్వాత పూజ చేయాలని బయటికెళ్లాలని భర్తకు సూచించాడు. ఆమెను గదిలో వదిలివెళ్లిన భర్తకు కొద్దిసేపటికి అరుపులు వినిపించాయి. ఆ మహిళతో శృంగారంలో పాల్గొనేందుకు బాబా ప్రయత్నించడంతో ఆమె బిగ్గరగా కేకలు పెట్టింది. ఆ తర్వాత తన భర్త సహకారంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దొంగబాబా కటకటాలపాలయ్యాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments