ఫేస్‌బుక్ ఫ్రెండ్ అమ్మాయి కోసం వెళితే కట్టేసి కొట్టారు...

ఠాగూర్
గురువారం, 21 ఆగస్టు 2025 (11:41 IST)
ఫేస్‍‌బుక్‌లో పరిచయమైన అమ్మాయి కోసం వెళ్లిన ఓ యువకుడుకి ఆ యువతి కుటుంబ సభ్యులు బడితపూజ చేసి పంపించారు. దాదాపు 13 గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రేవా జిల్లా బైకుంఠ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు మౌగంజ జిల్లా పిప్రాహి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికతో ఫేస్‌బుక్‌తో పరిచయం ఏర్పడింది. ఆమెను కలిసేందుకు సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించి శనివారం ఆ యువకుడు పిప్రాహి గ్రామానికి వెళ్లాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని, చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు సుమారు 13 గంటల పాటు తీవ్రంగా కొట్టారు. ఈ దాడినంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. 
 
ఈ వీడియో తమ దృష్టికి వచ్చినట్టు ఎస్పీ ఆర్ఎస్ ప్రజాపతి మీడియాకు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మా దృష్టికి వచ్చింది. ఫేస్‌బుక్‍‌లో పరిచయమైన మైనర్ బాలికను కలిసేందుకు ఆ యువకుడు వచ్చాడు. ఈ ఘటనపై హనుమాన్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదు. అయినప్పటికీ దీనిపై పూర్తి సమాచారం సేకరించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ను ఆదేశించాం అని ఆయన వివరించారు. వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments