Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం: పెళ్లాడమంటే ప్రియురాలిని హత్య చేసిన జిమ్ ట్రైనర్

ఠాగూర్
సోమవారం, 28 అక్టోబరు 2024 (13:15 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో మాయమైన ఓ మహిళ.. ఆ జిల్లా మేజిస్ట్రేట్ బంగళాకు సమీపంలో శవమై కనిపించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలను పరిశీలిస్తే, నాలుగు నెలల క్రితం అదృశ్యమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త భార్య మృతదేహం తాజాగా కాన్పూరు జిల్లాలోని మేజిస్ట్రేట్ బంగళా సమీపంలో లభ్యమైంది. 
 
ఈ కేసులో కాన్పూరులోని రాయుర్వా ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్‌ను అనుమానించి అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించడంతో ఆమె హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను తానే చంపి పూడ్చిపెట్టానని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.
 
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళ ఈ యేడాది జూన్ 24వ తేదీన అదృశ్యమైంది. జిమ్ ట్రైనర్‌కు పెళ్లి నిశ్చయమైనట్టు తెలియడంతో జీర్ణించుకోలేకపోయిన ఆమె అతడిని కలిసేందుకు జిమ్‌కు వెళ్లింది. 
 
ఆ తర్వాత ఇద్దరూ కలిసి కారులో బయటకు వెళ్లారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పెళ్లి విషయమై వాగ్వివాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన నిందితుడు ఆమె మెడ వెనుక బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెను హత్య చేసి పూడ్చిపెట్టేశాడు.
 
అతడు ఆ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడంతో కేసును ఛేదించడం కష్టమైందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసు బృందాలను పూణే, ఆగ్రా, పంజాబ్ పంపారు. కాగా, ఆ సమయంలో బాధిత మహిళ ధరించిన ఆభరణాలను నిందితుడు తీసుకున్నదీ, లేనిదీ నిర్ధరించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments