Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేసిన తప్పులకు మన్నించండి ఓటరు దేవుళ్లారా.. తన చెప్పుతో తానే దండించుకున్న మాజీ ఎమ్మెల్యే

తప్పులు చేసి ఉంటే మన్నించి మరిచిపోండి. నేనిప్పుడు మారిన మనిషిని. మీ మనిషిని. మీకు సేవ చేసుకునే అవకాశం ఈసారి తప్పక కల్పించండి అంటూ ఓటర్లకు విన్నపాలు చేసుకునే రాజకీయ నేతలను, అభ్యర్థులను చాలామందిని చూశాం. కానీ చెప్పులతో తన్ను తాను ఎడా పెడా వాయించుకుని మ

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (02:58 IST)
తప్పులు చేసి ఉంటే మన్నించి మరిచిపోండి. నేనిప్పుడు మారిన మనిషిని. మీ మనిషిని. మీకు సేవ చేసుకునే అవకాశం ఈసారి తప్పక కల్పించండి అంటూ ఓటర్లకు విన్నపాలు చేసుకునే రాజకీయ నేతలను, అభ్యర్థులను చాలామందిని చూశాం. కానీ చెప్పులతో తన్ను తాను ఎడా పెడా వాయించుకుని మరీ ఓటర్లకు క్షమాపణలు చెప్పిన అరుదైన ఘటన ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలలో జరిగింది. 
 
యూపీ ఎన్నికల ప్రచారంలో అరుదైన, అనుకోని ఘటన చోటుచేసుకుంది. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ఓటమి పాలైన సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షుజాత్ ఆలం ఈసారి కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఈయన బీఎస్పీ అభ్యర్థి హజీఅలీంపై పోటీ చేస్తున్నారు. 
 
రెండు రోజుల క్రితం బులందర్‌షహర్‌లో షుజాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ ఒక్కసారిగా కాలి షూ తీసి ఆ చెంప, ఈ చెంప ఎడాపెడా వాయించుకున్నారు. తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే మన్నించాలని కోరుతూ ప్రజల సమక్షంలో చెంపలు వాయించుకుని తనకు తానే దండించుకున్నారు. 
 
గతంలో చేసిన తప్పులకు తనను క్షమించి ఈసారికి మటుకు ఓట్లు వేయాల్సిందిగా ప్రజలను కోరారు. దీంతో అవాక్కవడం ప్రజలవంతైంది. అభ్యర్థి తనను తాను దండించుకున్న వీడియో సోషల్ మీడియాకు కూడా ఎక్కడంతో వైరల్ అయింది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జర్నలిస్టుపై దాడి కేసు- మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

బాహుబలితో నా 544వ చిత్రాన్ని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది : అనుపమ్ ఖేర్

పెళ్లి వయస్సు వచ్చింది, దెయ్యంకంటే మనుషులంటే భయం : విశ్వక్ సేన్

Kamal Hassan: మెగాస్టార్ చిరంజీవి కాదు.. రాజ్యసభకు కమల్ హాసన్?

ఫుల్ గడ్డంతో.. తండ్రిలాగే పంచె కట్టి సరికొత్త లుక్‌లో అకీరా నందన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments