Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవ్ టీజింగ్... ఆవేశంతో ఆకతాయిలను చితకబాదిన బాలిక...

Webdunia
మంగళవారం, 7 జులై 2015 (13:37 IST)
ఈవ్ టీజింగ్‌పై ఎన్ని చట్టాలు తెచ్చినా ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. ఈ విషయంలో పోలీసులు మెతకవైఖరి చూపుతున్నట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల ఈవ్ టీజింగ్‌ చేసే వారిపై బాధితులే ఎదురుదాడికి తిరుగుతున్నారు. ఈవిధంగా తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో స్నేహితులతో కలిసి స్కూలుకెళుతున్న ఓ బాలికను కొంతమంది ఆకతాయిలు టీజ్ చేశారు. 
 
అయినా ఆ బాలిక ఎంతో ఓర్పుతో సహిస్తూ వచ్చింది. దీంతో మరింత రెచ్చిపోయిన ఆకతాయిలు బూతు పదాలను వాడటం మొదలెట్టారు. ఇక తల వంచుకుంటే లాభం లేదనుకున్న ఆ బాలిక స్నేహితులతో కలిసి ఇద్దరు ఆకతాయిలను కట్టేసి పోలీసులకు పట్టించింది. అయినా తనను అంతగా వేధించిన వారిని అలా వదిలేశామే అనే బాధ ఆ బాలికను ఉండబట్టనివ్వలేదు. 
 
దీంతో వెంటనే ఆ బాలిక ఇదే విషయాన్ని తండ్రికి చెప్పి, ఆయనతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అనంతరం ఆ బాలిక తన బాధను పోలీసులకు చెప్పి, అనుమతి పొందింది. తనపై బూతు మాటలు విసిరిన ఆకతాయిని పట్టుకుని చెంపలు వాయించింది. అయినా కసి తీరక పిడిగుద్దులతో చితకబాదింది. అంతటితో ఆగక ఇక భవిష్యత్తులో మరే బాలికనూ వేధించనని చెప్పమంటూ ఆ ఆకతాయిల చేత మాట పలికించింది. 
 
బాలిక  ఉగ్రరూపానికి బెంబేలెత్తిన ఆకతాయిలు ఆమె కాళ్లు పట్టుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనికి పెద్ద సంఖ్యలో లైక్స్ కూడా వస్తున్నాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments