Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిక్నిక్ స్పాట్‌గా మారిన సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ ప్రాంతం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ కేంద్ర కారాగారం నుంచి 8 మంది ఉగ్రవాదులు తప్పించుకుని పోరిపోగా, వారిని భోపాల్ పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిపారేశారు. ప్రస్తుతం ఈ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం ఓ పిక్నిక్

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (14:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ కేంద్ర కారాగారం నుంచి 8 మంది ఉగ్రవాదులు తప్పించుకుని పోరిపోగా, వారిని భోపాల్ పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిపారేశారు. ప్రస్తుతం ఈ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం ఓ పిక్నిక్ స్పాట్‌గా మారిపోయింది. ఎన్‌కౌంటర్ నాటి ఘటనకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు ఇంకా అక్కడ ఉండగానే.. స్థానికులు ఈ ప్రాంతానికి వచ్చి తెగ సెల్ఫీలు దిగేస్తున్నారు. 
 
ఎన్‌కౌంటర్‌ అనంతరం పోలీసులు ఈ ప్రాంతంలో ఎలాంటి బారికేడ్లు పెట్టలేదు. ఉగ్రవాదులు జైల్లో ధరించిన దుస్తులు అక్కడే పడివున్నాయి. నేలమీద, గడ్డిమీద, రాళ్లమీద.. రక్తం మరకలు ఎండిపోయి వున్నాయి. అలాంటి దృశ్యాలను చూసేందుకు గ్రామస్థులు పిల్లలతో కలిసి వస్తున్నారని, సెల్ఫీలు తీసుకుంటున్నారని స్థానిక పత్రికలు రాశాయి. 
 
కొందరు ఆ ప్రదేశంలో కూర్చుని కబుర్లు చెప్పుకొంటూ పిక్నిక్‌లాగా సమయం గడుపుతున్నారని పేర్కొన్నాయి. ఇదే విషయమై మీడియా పోలీసులను ప్రశ్నించగా ఎన్‌కౌంటర్‌ తర్వాత ఆ ప్రాంతంలో తమకు అవసరమైన సాక్ష్యాలన్నీ తీసుకున్నామని, అందుకే బారికేడ్లు ఏర్పాటుచేయలేదని ఎస్పీ ధరంవీర్‌ సింగ్‌ తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments