Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో వకీల్ పాండే ఎన్‌కౌంటర్...

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (11:03 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కరుడుగట్టిన ఇద్దరు రౌడీలను ఎన్‌కౌంటర్ చేశారు. వీరిలో ఒకరు పేరుమోసిన రౌడీ వకీల్ పాండే ఉన్నాడు. గత రాత్రి జరిగిన ఈ ఎన్‌కౌంటర్ వివరాలను పరిశీలిస్తే, యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి కరుడుగట్టిన ఇద్దరు షార్ట్ షూటర్లను కాల్చివేశారు. ఈ ఘటన ప్రయాగ్ రాజ్ సమీపంలో జరిగింది. 
 
మృతి చెందిన క్రిమినల్స్‌ను వకీల్ పాండే అలియాస్ రాజీవ్ పాండే, అలియాస్ రాజు, అమ్జాద్‌గా గుర్తించారు. వీరిద్దరూ 2013లో జరిగిన వారణాసి డిప్యూటీ జైలర్ అనిల్ కుమార్ త్యాగి హత్య కేసులో ప్రధాన నిందితులని పోలీసు అధికారులు వెల్లడించారు.
 
వీరిద్దరూ మున్నా భజరంగీ, ముఖ్తార్ అన్సారీల తరపున పనిచేస్తున్నారని, వీరి తలలపై రూ.50 వేల చొప్పున రివార్డులు ఉన్నాయని అన్నారు. వీరిద్దరి ఆచూకీ గురించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు ప్రయాగ్ రాజ్ డీఎస్పీ నవేందు కుమార్ నేతృత్వంలో రైడ్‌కు వెళ్లారని, ఆ సమయంలో ఎన్‌కౌంటర్ జరిగిందని వివరించారు. 
 
ఎన్‌కౌంటర్ తర్వాత 30 ఎంఎం, 9 ఎంఎం పిస్టళ్లతో పాటు లైవ్ కాట్రిడ్జ్‌లను, ఓ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కాగా, గతయేడాది బహోదీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ మిశ్రాను వీరిద్దరూ బెదిరిస్తూ, హత్య చేస్తామని ఓ లేఖను పంపడం కలకలం రేపింది. దీంతో విజయ్ మిశ్రా, తనకు సెక్యూరిటీని పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments