Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్లలోనే 'రారాజు'ను రుచిచూసిన 'గజరాజు'.. వీడియో వైరల్

Webdunia
బుధవారం, 13 మే 2020 (12:41 IST)
సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే. పైగా, పండ్లలోనే రారాజు ఈ మామిడి పండు. ఈ పండును ఇష్టపడని వారంటూ ఉంటరు. అలాంటి మామిడి పండ్ల సీజన్ వచ్చిందని గ్రహించిన ఓ గజరాజు.. మామిడి పండును రుచిచూసింది. అయితే, ఇది మామిడిపండ్ల సీజన్ అని ఆ గజరాజుకు ఎలా తెలిసిందో తెలియదుకానీ.. ఏకంగా మామిడితోపులోకి వచ్చి ఓ చెట్టును తొండంతో మెల్లగా ఊపింది. అంతే.. మామిడి పండ్లు కిందపడటంతో తన తొండంతో తీసుకుని నోట్లో మింగేసింది. అలా పండ్లలోనే రారాజు అయిన మామిడిపండును గజరాజు రుచిచూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సుశాంతా నందా అనే ఇండియన్ ఫారెస్ట్ అధికారి ఒకరు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు. 'ఇది మామిడి పళ్ల సీజన్. పండ్లలోనే రారాజుగా చెప్పుకునే మామిడిని ఈ భారీ గజరాజం రుచి చూడకుండా ఎలా ఉండగలదు. అందుకే చెట్టుని మెల్లగా ఊపుతూ.. రాలిన పళ్లను రుచి చూస్తోంది' అంటూ కామెంట్ చేశాడు. 
 
ఈ వీడియో కాస్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈయన తరచూ జంతువులకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. అలాగే, ఈ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అయితే, ఈ ఏనుగు మామిడిపండ్లను ఎక్కడ ఆరగించిందన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments