Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు - హర్యానా హస్తం.. జేకేలో కూటమి ముందంజ

ఠాగూర్
మంగళవారం, 8 అక్టోబరు 2024 (09:45 IST)
యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం నుంచి వెలువడుతున్నాయి. ఈ ఫలితాల ప్రారంభ ట్రెండ్‌లో హర్యానాలో హస్తం పార్టీ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో బీజేపీయేతర కూటమి పార్టీలు ముందంజలో ఉన్నాయి. 
 
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రస్తుతం ఈ కౌంటింగ్ ప్రశాంతంగా సాగుతుంది. కౌంటింగ్ ఆరంభ ట్రెండ్స్ విషయానికి వస్తే.. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ 70కిపై స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇక బీజేపీ 17 కంటే తక్కువ చోట్ల, ఇతరులు పలు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
ఇక దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు ఎన్నికలు జరుపుకున్న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ బీజేపీ, కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మధ్య హోరాహోరీ పోరు ఖాయమని ఆరంభ ట్రెండ్‌ను బట్టి అర్థమవుతోంది. జమ్మూ కాశ్మీర్ కూడా కాంగ్రెస్ కూటమి 34కు పైగా స్థానాల్లో, బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
 
ఇకపోతే, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటింగ్కు ముందే సంబరాలను మొదలుపెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో కౌంటింగ్ మొదలు కాకముందే హస్తం పార్టీ నాయకులు వేడుకలు మొదలుపెట్టారు. కాగా హర్యానా, జమ్మూ కశ్మీర్ రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ 90 సీట్లు ఉన్నాయి. మేజింగ్ ఫిగర్ 46 సీట్లుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments