Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై అంథేరిలో అగ్నిప్రమాదం... 8 మంది సజీవదహనం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని అంథేరి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 5.15 గంటల సమయంలో ఓ మందుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ఒ

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (14:50 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని అంథేరి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 5.15 గంటల సమయంలో ఓ మందుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు... వారిలో నెలల పసికందు కూడా ఉంది. 
 
ఈ ప్రమాదం జరిగిన బిల్డింగ్‌లో కింద మెడికల్ షాప్ ఉండగా, పైన ఫ్లోర్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబసభ్యులు అంతా గాఢనిద్రలో ఉన్నారు. క్షణాల్లో మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో వారికి తప్పించుకునే అవకాశం లేక వారంతా సజీవదహనమైనట్టు పోలీసులు వెల్లడించారు. కాగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments