72 గంటల్లో ప్రధాని మోడీ ఫోటోలన్నీ తొలగించాలి.. ఈసీ ఆదేశం

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (08:45 IST)
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. 72 గంటల్లో ప్రధాని నరేంద్ర మోడీ పోటో తొలగించాలని ఆదేశాలుజారీచేసింది. దేశంలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నా. ఈ ఐదు రాష్ట్రాల్లోని పెట్రోల్ పంపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాలను 72 గంటల్లోగా తొలగించాలని ఈసీ ఆదేశించింది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రాలతో కేంద్రప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ పెట్రోల్ పంపుల్లో హోర్డింగులు పెట్టడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా ఈసీ పేర్కొంది. పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికలకు గత శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెల్సిందే. 
 
కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రచారంలో ప్రధాని మోడీ ఫొటోలు, పోస్టర్లు, వీడియోలను వినియోగిస్తున్నారని, దీనిపై ఆదేశాలు జారీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో పెట్రోల్ పంపులతోపాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రచారంలో ప్రధాని మోడీ చిత్రాలు, పోస్టర్లు, వీడియోలను 72 గంటల్లోగా తొలగించాలని ఈసీ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments