Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డకు పాలిస్తే భర్త విడాకులిస్తాడట.. నేను పాలివ్వను... ముస్లిం మత పెద్ద అరెస్టు

కేరళ రాష్ట్రం కోళికోడ్‌లో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువుకు ఐదో అజాన్ కాల్ పూర్తయ్యే వరకు తల్లిపాలు ఇవ్వొద్దని చెప్పిన ముస్లిం మత పెద్ద హైడ్రోస్ థంగల్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆయన

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (15:30 IST)
కేరళ రాష్ట్రం కోళికోడ్‌లో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువుకు ఐదో అజాన్ కాల్ పూర్తయ్యే వరకు తల్లిపాలు ఇవ్వొద్దని చెప్పిన ముస్లిం మత పెద్ద హైడ్రోస్ థంగల్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆయన సలహాలను పాటించిన ఆ శిశువు తండ్రి అబూబకర్‌ను కూడా జైలుకు పంపించారు.
 
కోళికోడ్‌కు చెందిన ఓ మహిళ బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ బిడ్డ జన్మించింది. అబూబకర్ దంపతులకు ఈ బిడ్డ రెండో సంతానం. పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వాలని ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కోరారు. కానీ బిడ్డకు పాలిచ్చేందుకు ఆ మహిళ నిరాకరించింది. చివరకు వైద్యులు, సిబ్బంది ఎంత చెప్పినా వినిపించుకోలేదు. 
 
తాను పాలు ఇస్తే తనకు తన భర్త విడాకులు ఇస్తాడని చెప్పింది. అబూబకర్‌కు కూడా ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులపై బాలల హక్కుల చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అబూబకర్‌ను, హైడ్రోస్ థంగల్‌ను కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments