Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ, పన్నీర్‌ వర్గాలకు ఈసీ షాక్‌... ఆర్కే.నగర్‌లో "రెండాకులు" చిహ్నం మాయం

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. ఆ పార్టీ అధికారిక ఎన్నికల గుర్తు రెండాకులు చిహ్నాన్ని స్తంభింపజేసి

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (08:31 IST)
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. ఆ పార్టీ అధికారిక ఎన్నికల గుర్తు రెండాకులు చిహ్నాన్ని స్తంభింపజేసింది. దీంతో చెన్నై, ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తు ఎక్కడా కనిపించదు. 
 
ఈ కారణంగా ఆర్‌కే.నగర్‌ ఉప ఎన్నికలో అభ్యర్థులెవరైనా ‘స్వతంత్రులు’గానే, ఇతర గుర్తుతో పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో 37 ఏళ్ళ తర్వాత అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం లేకుండానే ఎన్నికల బరిలోకి దిగనుంది. చిహ్నాన్ని గురువారం ఉదయం 10 గంటల్లోపు ఎన్నుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. 
 
ఆర్కేనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల నామినేషన్ గడువు గురువారం ముగియనున్న తరుణంలో రెండాకుల చిహ్నం కోసం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. ఈ రెండు వర్గాల తరపున పలువురు సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. 
 
కాగా, ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత సంక్షోభం తలెత్తిన విషయం తెల్సిందే. అదేసమయంలో ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిద్దరు రెండాకుల గుర్తు కోసం పోటీ పడటంతో ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ గుర్తును తాత్కాలికంగా మాయం చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇక్కడ ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే: మెగాస్టార్ చిరంజీవి

ఫాదర్స్‌ సూసైడ్‌ స్టోరీతో బాపు సినిమా : బ్రహ్మాజీ

పవన్ కల్యాణ్ పెద్ద స్థాయికి వెళతారని పంజా టైమ్‌లోనే అర్థమైంది : డైరెక్టర్ విష్ణు వర్ధన్

కొత్తదనం కావాలనుకునే వారు తల సినిమా ఆనందంగా చూడవచ్చు : అమ్మరాజశేఖర్

రాజా మార్కండేయ ట్రైలర్ లో మంచి కంటెంట్ వుంది : సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

ఆఫ్రికా హృదయం నుండి ఆయుర్వేద జ్ఞానం వరకు: మరువా x సరితా హండా

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments