Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన ప్రియురాలిని ఈ-కామర్స్‌ సైట్‌ ''ఈబే''లో అమ్మకానికి పెట్టేశాడు..

మించిన ప్రియురాలిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన విదేశాల్లో చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా చేశాడు.

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (10:40 IST)
ప్రేమించిన ప్రియురాలిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన విదేశాల్లో చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా చేశాడు. వివరాల్లోకి వెళితే.. డేల్ లీక్స్‌, కెల్లీ గ్రీవ్స్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే వారిద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా ఓ సారి కెల్లీ అతడిని బాగానే కొట్టింది. అప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న డేల్ ఆమెకు గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాడు.

 
అంతే అనుకున్నదే తడవుగా అతడు ఈ-కామర్స్‌ సైట్‌ ''ఈబే''లో ఆమెను అమ్మనున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆమె ప్రవర్తన, శారీరక సౌందర్యం గురించి వర్ణించాడు. అయితే ఈడేదో తిక్కలో తన ప్రియురాలిని అమ్మకానికి పెట్టాడో లేదో ఆ ప్రకటనకు విపరీతమైన స్పందన వచ్చింది. 24 గంటల్లో ఈ ప్రకటనను 86వేల మంది చూశారు. చివరకు ఓ వ్యక్తి అయితే రూ. 68లక్షలు చెల్లిస్తానని ముందుకు వచ్చాడు.
 
కెల్లీని డ్రైవ్‌కు తీసుకెళ్తామంటూ అతడి ఫోన్‌కు పెద్ద సంఖ్యలో సందేశాలు వచ్చాయి. కానీ ఈబే వెంటనే ఆ యాడ్‌ను తొలగించింది. మానవ శరీరాన్ని, ఇతర భాగాలను అమ్మడానికి తమ వెబ్‌సైట్ అనుమతించదని ఈబే స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments