Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మహిళ తాగి తందనాలాడింది.. రెండు తగిలించి లాక్కెళ్ళిన పోలీసులు...

పూటుగా మద్యం సేవించిన మహిళ మద్యం మైకంతో ఢిల్లీ రోడ్డు మొత్తం వీరవిహారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను ప్రశ్నించిన అధికారులను లాగిపెట్టి కొట్టి నానా హంగామా సృష్టించింది. "దయచేసి ఇక్

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (14:12 IST)
పూటుగా మద్యం సేవించిన మహిళ మద్యం మైకంతో ఢిల్లీ రోడ్డు మొత్తం వీరవిహారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను ప్రశ్నించిన అధికారులను లాగిపెట్టి కొట్టి నానా హంగామా సృష్టించింది. "దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి" అని చెప్పిన ఓ వ్యక్తిని నువ్వెవెరు అడగడానికి అని ప్రశ్నించి అతడిని తిట్టిపోసింది. తాను తాగుబోతునని, ఇలాగే రోడ్ల వెంట తిరుగుతానని బహిరంగంగానే చెప్పింది. 
 
ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మద్యం సేవించిన ఓ మహిళ హంగామా చేస్తోందని ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించడానికి మహిళా పోలీసులు ముప్పుతిప్పులు పడ్డారు. అనంతరం ఆమెను రిక్షాలో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడా కూడా వారిపై శివంగిలా తన ప్రతాపం చూపింది. 
 
స్టేషన్ లోపలికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, తాను ఏం నేరం చేశానంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులను అసభ్యపదజాలంతో దూషించి వారిని కొట్టబోయింది. దీంతో ఆమెపై రెండు దెబ్బలేసి మరీ మహిళా పోలీసులు లోపలికి తీసుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియోను సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments