Webdunia - Bharat's app for daily news and videos

Install App

దెయ్యమే ఆ పని చెయ్యమంది.. కూతురు చెవులు కోసేసిన తండ్రి.. గొంతు కోయబోయాడు.. ఇంతలో?

ఢిల్లీలో ఓ వ్యక్తి తన పెద్ద కుమార్తె మరణించిన నాటి నుంచి వింతగా ప్రవర్తిస్తున్నాడు. తన పెద్ద కుమార్తె మరణించినప్పటి నుంచి అతనికి దెయ్యం కనిపిస్తోందని చెప్తున్నాడు. అంతటితో ఆగకుండా తన రెండో కుమార్తెను

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (14:27 IST)
ఢిల్లీలో ఓ వ్యక్తి తన పెద్ద కుమార్తె మరణించిన నాటి నుంచి వింతగా ప్రవర్తిస్తున్నాడు. తన పెద్ద కుమార్తె మరణించినప్పటి నుంచి అతనికి దెయ్యం కనిపిస్తోందని చెప్తున్నాడు. అంతటితో ఆగకుండా తన రెండో కుమార్తెను ఆ దెయ్యం ఎత్తుకుపోతానని బెదిరిస్తోందని చెప్పాడు. ఇంకా చిన్న కుమార్తెను ఎత్తుకుపోకుండా వుండాలంటే ఆమె రెండు చెవులు కోసేయాలని చెప్పిందన్నాడు. చివరికి చిన్న కూతురి చెవుల్ని కోసేశాడు.
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన బహదూర్‌ అనే ఓ లారీ క్లీనర్‌కి ఆరుగురు సంతానం. ఇటీవ‌ల బహదూర్ పెద్ద కూతురు మృతి చెందింది. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన అతడు వింతగా ప్రవర్తించడం మొదలెట్టాడు. దెయ్యం కనిపిస్తోందని, ఆ దెయ్యం చిన్న కూతురు చెవులు కోసేయమందని చెప్పాడు. గురువారం అర్థరాత్రి తర్వాత మద్యం సేవించి ఇంటికొచ్చిన అతడు నిద్రిస్తున్న చిన్నకూతురి చెవిని కోసేశాడు. 
 
ఆ చిన్నారి అరుపులు పెట్ట‌డంతో అత‌డి భార్య లేచి చూసేసరికి... చెవి నుంచి ర‌క్తం కారుతూ ఆ పాప క‌నిపించింది. వెంట‌నే ఆ పాపని ఆస్పత్రికి తీసుకెళ్లాల‌ని చూసింది. అయితే, ఆమెను బహదూర్ అడ్డుకుని.. మిగిలిన పిల్లల్ని ఓ గదిలో నెట్టేసి.. చిన్న కుమార్తె రెండో చెవిని కూడా కోసేశాడు. అరుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
బహదూర్ రెచ్చిపోయి చిన్నకూతురి గొంతు కోయబోయాడు. ఇంతలో పోలీసులు పాపను కాపాడారు. ఇదంతా దెయ్యమే చేయమందనే సరికి పోలీసులు అవాక్కయ్యారు. పాప‌ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. పెద్ద కుమార్తె చ‌నిపోవ‌డంతో బ‌హ‌దూర్ మాన‌సికంగా కృంగిపోయి ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పెద్దమ్మాయి మరణించినప్పటి నుంచి తన భర్త ఇలాగే ప్రవర్తిస్తున్నాడని, అతని దెయ్యం కనిపిస్తుందని చెప్తున్నాడని భార్య చెప్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments