Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిలే బస్సులు, కారుల్లోనే కాదు... ఎగిరే విమానాల్లోనూ స్త్రీలపై కామాంధుల లైంగిక వేధింపులు

మహిళలకు ఏమాత్రం రక్షణ లేదనే విషయం దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. కేవలం భూమ్మీదే కాదు.. నింగిలోనూ ఇదే పరిస్థితి నెలకొనివుంది. తాజాగా ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌‌లు విమానంలో లైంగ

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (19:59 IST)
మహిళలకు ఏమాత్రం రక్షణ లేదనే విషయం దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. కేవలం భూమ్మీదే కాదు.. నింగిలోనూ ఇదే పరిస్థితి నెలకొనివుంది. తాజాగా ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌‌లు విమానంలో లైంగికవేధింపులకు గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మధ్యప్రదేశ్‌లోని బాలఘాట్‌కి చెందిన 23 ఏళ్ల ఆకాశ్ గుప్త ఇటీవల గోవా వెళ్లాడు. ఈయన ఓ హార్డ్‌వేర్ ట్రేడర్. ముంబై నుంచి నాగ్‌పూర్‌ మధ్య నడిచే జెట్‌ఎయిర్‌వేస్ విమానంలో ముంబై ఎయిర్‌పోర్టులో నాగ్‌పూర్ విమానం ఎక్కాడు. విమానం ఎక్కే ముందే తప్పతాగిన అతడు... తనకు భోజనం వడ్డిస్తున్న ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌లను చెయ్యిపట్టి లాగాడు. 
 
అడ్డుకోబోయిన ఇతర సిబ్బందితోనూ వాగ్వాదానికి దిగాడు. దీంతో వారంతా కెప్టెన్‌ దృష్టికి తీసుకెళ్లగా... ఈయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం మేజిస్ట్రీరియల్ కస్టడీలో ఉన్న గుప్తపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం