Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రింక్స్‌లో డ్రగ్స్ కలిపి బలవంతంగా తాగించారు..

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (09:20 IST)
హర్యానాకు చెందిన బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్‌ స్టార్‌ సొనాలీ ఫోగట్‌ మృతి కేసులో మరో కొత్త కోణాన్ని గోవా పోలీసులు చెప్పారు. హత్యగా భావిస్తున్న ఈ కేసులో నిందితులైన ఫోగట్‌ సహోద్యోగులు ఇద్దరు ఆమెకు నార్త్‌ గోవాలోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన పార్టీలో పానీయంలో డ్రగ్స్‌ కలిపి బలవంతంగా తాగించారని పోలీసులు చెప్పారు. 
 
నిందితులిద్దరూ పానీయంలో ఓ రసాయన పదార్థాన్ని కలిపి బలవంతంగా తాగించడం సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిందని, ఇదే విషయాన్ని నిందితులు సుధిర్‌ సగ్వాన్‌, సుఖ్విందర్‌ సింగ్‌ విచారణలో ఒప్పకున్నారని కూడా ఐజీపీ ఓంవీర్‌ సింగ్‌ బిష్ణోయ్‌ తెలిపారు.
 
ఫోగట్‌ స్పృహ కోల్పోయిన అనంతరం ఆమెను రెస్టారెంట్‌లోని ఓ వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, అక్కడే రెండు గంటల పాటు ఉన్నారని, అయితే అక్కడ ఏం జరిగిందనే దానిపై నిందితులు నోరు విప్పలేదన్నారు. 
 
పానీయంలో కలిపిన రసాయన పదార్థం వలనే ఫోగట్‌ మరణించినట్టు అనిపిస్తుందని, ఆర్థికపరమైన విషయాలే ఇందుకు కారణమై ఉండొచ్చని తెలిపారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments