జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని భారత రక్షణ స్థావరాలపై ఉగ్రమూకలు కన్నేసినట్టు తెలుస్తోంది. దీంతో డ్రోన్లతో దాడులు చేసేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాశ్మీర్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ల సాయంతో దాడులు చేశాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
ఈ నేపథ్యలో తాజాగా జమ్మూలో మళ్లీ డ్రోన్లు కలకలం సృష్టించాయి. బుధవారం రోజు మూడు ప్రదేశాల్లో డ్రోన్లను భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో బలగాలు అప్రమత్తం అయ్యాయి. డ్రోన్లను మిరాన్ సాహిబ్, కలుచాక్, కుంజ్వాని ఏరియాల్లో గుర్తించినట్లు తెలిపారు.
గత నాలుగు రోజుల నుంచి మిలటరీ క్యాంపుల పరిసరాల్లో ఏడు డ్రోన్లను గుర్తించినట్లు భదత్రా బలగాలు పేర్కొన్నాయి. జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడిని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు అప్పగించి, సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.