Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో ఇక పబ్లిక్‌గా మందుకొడితే జైలుకు వెళ్లాల్సిందే.. కొత్త రూల్

పర్యాటక రాష్ట్రంగా పేరు సంపాదించిన గోవాలో ఒక బహిరంగంగా మద్యం సేవిస్తే జైలుకు వెళ్లాల్సివుంటుంది. గోవాకు విదేశీ, స్వదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అయితే పబ్లిక్‌గా తప్పతాగడం అక్కడ సర్వసాధారణ

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (16:54 IST)
పర్యాటక రాష్ట్రంగా పేరు సంపాదించిన గోవాలో ఒక బహిరంగంగా మద్యం సేవిస్తే జైలుకు వెళ్లాల్సివుంటుంది. గోవాకు విదేశీ, స్వదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అయితే పబ్లిక్‌గా తప్పతాగడం అక్కడ సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో గోవా పోలీసులు కొత్త రూల్ తీసుకొచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం సేవిస్తూ కన్పిస్తే వారిని అరెస్టు చేయాలని ఆ రాష్ట్ర పోలీసు శాఖ తమ సిబ్బందిని ఆదేశించింది. 
 
ఉత్తర గోవా ఎస్పీ కార్తీక్ కశ్యప్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ… భారత శిక్షా స్మృతి (ఐపిసి)లోని సెక్షన్ 34 కింద బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని అరెస్టు చేయాలని తమ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు.
 
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని ఎవరైనా చూస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా విలాసాలకు వినోదాలకు పెట్టింది పేరైన గోవాల్ పబ్లిక్‌గా మందుకొట్టిన వారిని అరెస్ట్ చేయడం అనే కొత్త రూల్ ఎంతమేరకు పనిచేస్తుందో వేచి చూడాలి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments