Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరకట్నం వేధింపులతో భార్య ఆత్మహత్య.. భర్త జైలుకు.. పోలీసులే అత్తకు వైద్యం ఇప్పించారు..

వరకట్న మృతి కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు, దోషి అయిన భర్తను జైలుకు పంపించిన కేసులో... వయసు మళ్లి పక్షవాతంతో బాధపడుతున్న ఓ తల్లిని చూసుకునే బాధ్యతలను కోర్టు ఢిల్లీ పోలీసులకు అప్ప

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (18:41 IST)
వరకట్న మృతి కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు, దోషి అయిన భర్తను జైలుకు పంపించిన కేసులో... వయసు మళ్లి పక్షవాతంతో బాధపడుతున్న ఓ తల్లిని చూసుకునే బాధ్యతలను కోర్టు ఢిల్లీ పోలీసులకు అప్పగించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ, పితాంపురాకు చెందిన ఓ వ్యక్తికి 2013 ఫిబ్రవరిలో ఓ మహిళతో వివాహమైంది. 
 
ఇది వీరిద్దరికీ రెండో పెళ్లి.. భర్త తల్లి అనారోగ్యంతో ఆస్పత్రి పాలవడంతో వైద్య ఖర్చుల కోసం పుట్టింటి నుంచి డబ్బులు తెమ్మని భార్యను వేధించాడు. పలుసార్లు తన పుట్టింటివారితో ఈ విషయం చెప్పి వాపోయినా వారు పట్టించుకోకపోవడంతో.. 2013 జూన్ 2న అత్తవారింట్లో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వరకట్న మృతిగా నమోదైన ఈ కేసులో నిందితుడైన భర్తకు ఢిల్లీ కోర్టు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. 
 
అదే సమయంలో పక్షవాతంతో బాధపడుతున్న నిందితుడి తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. వృద్ధురాలి బాగోగోలపై ఢిల్లీ పోలీసులదే బాధ్యత అంటూ ఆదేశాలు చేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఆ వృద్ధురాలిని వృద్ధాశ్రమంలో చేర్పించి.. సరైన వైద్యం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments