Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొండపండు లాంటి భార్య, ఆ ఒక్క రాత్రి తను ఇంట్లో లేని సమయంలో మరొకరు వచ్చారనీ...

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (21:55 IST)
వారిద్దరి అన్యోన్యమైన దాంపత్యం. బంధువులే భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అనేవారు. అయితే అనుమానం వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. అందమైన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న కోపంతో తరచూ గొడవపెట్టుకునేవాడు భర్త. చివరకు చేసేది లేక ఆత్మహత్య చేసుకుంది భార్య. 
 
తమిళనాడు కాంచీపురం సమీపంలోని కుప్పమ్మల్ వినాయకపురంలో కదిరివేల్, మణిమంగలై దంపతులు నివాసముండేవారు. వీరికి 8 సంవత్సరాల కుమారుడు, నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. 
 
కదిరివేల్ ప్రభుత్వ బ్యాంకులో సెక్యూరిటీ ఉద్యోగి. రాత్రి వేళల్లో ఉద్యోగం నిమిత్తం వెళ్లేవాడు. అయితే సరిగ్గా రెండునెలల నుంచి వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. కుప్పమ్మల్ బంధువు రాత్రి వేళలో వచ్చి ఇంట్లో నిద్రించాడు. వరుసకు మామ. 
 
పనిమీద కాంచీపురం రావడంతో తెలిసిన బంధువు ఇంటిలోనే సేదతీరాడు. ఇక అప్పటి నుంచి కదిరివేల్‌లో అనుమానం మొదలైంది. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని కోపంతో ఊగిపోతూ పదేపదే గొడవకు దిగేవాడు. 
 
భర్తకు ఎంత సర్దిచెప్పినా వినిపించుకునేవాడు కదా. దాంతో పాటు తాగుడికి బానిసై ప్రతిరోజు భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో నిన్న రాత్రి కుప్పమ్మాల్ ఉరి వేసుకుని ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. తనలా మరొకరికి ఇలాంటి కష్టం రాకూడదని.. చేయని తప్పుకు నరకం అనుభవిస్తున్నాననీ, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె సుసైడ్ లేఖ రాసి చనిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments