Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిల్లర్ కరోనా... 24 అర్థరాత్రి నుంచి విమాన సర్వీసులు బంద్

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (18:39 IST)
దేశంలో కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అలాగే, మృతుల సంఖ్య కూడా ఎక్కువైపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో రైళ్లు, బస్సులు నిలిచిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. 
 
అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయగా, ఇప్పుడా జాబితాలో దేశీయ విమాన సర్వీసులు కూడా చేరాయి. దేశీయ విమానయాన సంస్థల కార్యకలాపాలను ఈ నెల 24 అర్థరాత్రి నుంచి నిలిపివేయాలని నిశ్చయించారు. తద్వారా దేశీయ రూట్లలో తిరిగే ప్రయాణికుల విమానాలు నిలిచిపోనున్నాయి. అయితే, రవాణా విమానాలకు ఈ నిర్ణయం వర్తించదు.
 
అంతకుముందు.. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌లు తమ తమ రాష్ట్రాలకు నడిచే స్వదేశీ విమాన సర్వీసులను నిలిపివేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 
 
దేశవ్యాప్తంగా కరోనా కారణంగా దాదాపు 80 జిల్లాల్లో లాక్‌డౌన్ అయిన తరుణంలో ఆమె తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. దేశంలో కరోనా విస్తరిస్తోందని... ఈ  పరిస్థితుల్లో కూడా దేశంలో విమాన రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయని ఆమె విమర్శించారు. 
 
విమానాలు తిరిగితే షట్ డౌన్‌కు అర్థం లేదని... క్వారంటైన్ విధానాలకు కూడా ఇది తూట్లు పొడుస్తుందని అన్నారు. విమానాల్లో ప్రయాణికుల మధ్య సామాజిక దూరం ఉండదని... పక్కపక్కనే కూర్చుని ప్రజలు ప్రయాణిస్తారని... దీనివల్ల  వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి వచ్చే అన్ని విమాన సర్వీసులను తక్షణమే రద్దు చేయాలని మోడీకి మమతా బెనర్జీ విన్నవించారు. అప్పుడే కరోనా మహమ్మారి విస్తరణకు తమ రాష్ట్రంలో అడ్డుకట్ట వేయగలమని... పశ్చిమబెంగల్ లాక్ డౌన్‌ను పూర్తి  స్థాయిలో అమలు చేయగలుగుతామని చెప్పారు. ఇదే తరహా అభిప్రాయాన్ని బీహార్ సీఎం కూడా వెలిబుచ్చారు. దీంతో కేంద్రం స్పందించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments