Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టే లాకర్... కడుపులో కిలోన్నర బంగారు ఆభరణాలు

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (09:20 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ కడుపులో నుంచి కిలోన్నర బంగారు ఆభరణాలను వైద్యులు ఆపరేషన్ చేసి వెలికి తీశారు. ఇందులో 90 నాణేలు, గొలుసులు, చెవిదుద్దులు ఇలా అనేకం ఉన్నాయి. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బీర్భుమ్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగాల్‌ రాష్ట్రంలోని బీర్భుమ్ జిల్లాకు చెందిన 26 యేళ్ళ మహిళ ఆభరణాలతో పాటు 5, 10 రూపాయల నాణేలు, రిస్ట్‌బ్యాండ్‌లు, వాచీలను కూడా మింగేసింది. ఇటీవల ఆమె ఆనారోగ్యంపాలైంది. దీంతో రాంపుర్హట్ ఆస్పత్రికి తరలించగా, ఆమె పొట్టను స్కాన్ చేసిన వైద్యులు... అందులోని వస్తువులను చూసి విస్తుపోయారు. 
 
పొట్టలో కిలోన్నరకు పైగా బంగారు ఆభరణాలు, 90 నాణేలు, కొన్ని బంగారపు గొలుసులు, ఉంగరాలు, చెవి దుద్దులు ఇలా అనేకం ఉన్నాయి. దీనిపై ఆమె తల్లి స్పందిస్తూ, తన కుమార్తెకు మతిస్థిమితం లేదనీ, గత కొన్ని రోజులుగా ఇంట్లోని వస్తువులు మాయమవుతూ వస్తున్నాయనీ, ఇపుడు ఏం జరిగిందో తెలిసిందన్నారు. ప్రస్తుతం ఆ మహిళకు ఆపరేషన్ చేసి బంగారు ఆభరణాలను బయటకు తీశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments