Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడి ఛాతిలో దిగిన బాణం - ప్రాణాలు కాపాడిన నిమ్స్ వైద్యులు!!

ఠాగూర్
ఆదివారం, 26 మే 2024 (09:27 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ గిరిజన యువకుడి ఛాతిలోకి బాణం దిగింది. వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆ బాలుడి ప్రాణాలను రక్షించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గడ్ బీజాపూర్ జిల్లా ఊనూర్ ప్రాంతానికి చెందిన సోది నంద (17) అనే గుత్తికోయ యువకుడు గురువారం అడవిలోకి వెళ్లాడు. ఈ క్రమంలో అతడికి ప్రమాదవశాత్తూ ఛాతిలో బాణం దిగింది. వెంటనే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చారు. 
 
వైద్యులు తొలుత యువకుడికి సీటీ స్కాన్ చేశారు. ఊపరితిత్తుల పక్క నుంచి గుండెలోని కుడి కర్ణికలోకి బాణం గుచ్చుకున్నట్టు గుర్తించారు. అప్పటికే భారీగా రక్తస్రావం కావడంతో యువకుడుకి రక్తం ఎక్కిస్తూనే ఆపరేషన్ చేసి బాణాన్ని తొలగించారు. బాణం దిగిన చోట రక్తం గడ్డకట్టడంతో అధిక రక్తస్రావం కాలేదని, దీంతో యువకుడి ప్రాణాలు నిలిచాయని వైద్యులు తెలిపారు. యువకుడు బలవంతంగా బాణం బయటకు తీసి ఉంటే రక్తస్రావమై ప్రాణాలు పోయి ఉండేవని తెలిపారు. ఆపరేషన్ ఉచితంగా చేశామని వారు తెలిపారు. కాగా ఆపరేషన్ చేసిన డాక్టర్ అమరేశ్వర రావు వైద్య బృందాన్ని నిమ్స్ డైరెక్టర్ అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments