Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్‌మస్‌ చెట్టు ఎలా పుట్టిందో తెలుసా?

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (09:30 IST)
రకరకాల బహుమతులు, బొమ్మలు, కేకులతో.. క్రిస్‌మస్‌ పండుగ చేసుకుంటున్నారు కదా! మరి క్రిస్‌మస్‌ చెట్టు ఎలా పుట్టిందో తెలుసా? శాంతాక్లాజ్‌ తాతయ్య ఎవరో తెలుసా? ఆ కథలేంటో తెలుసుకుందామా..!
 
చాలా ఏళ్ల క్రితం క్రీస్తు పుట్టిన రోజున చర్చికి వెళ్లి రకరకాల బహుమతులను క్రీస్తుకు ఇచ్చే సంప్రదాయం ఉండేది. అలా ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పేద పిల్లాడికి పాపం... ఏమివ్వాలో తెలియలేదు. ఏది కొనాలన్నా చేతిలో సెంటు కూడా లేదు. ఏం చేయాలో తోచని ప్లాబోకి తన ఇంటి ముందు ఓ అందమైన మొక్క కనిపించింది.

దానిని తీసి చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసుకెళ్లాడు. అక్కడ ఎన్నో విలువైన కానుకలతో వచ్చిన అందరూ ప్లాబో కానుక చూసి ఎగతాళి చేశారు. ప్లాబో సిగ్గుపడుతూ దానిని బాల ఏసు ప్రతిమ దగ్గర పెట్టాడు. ఆశ్చర్యం...!

వెంటనే ఆ చిన్న మొక్క అప్పటికప్పుడే ఎదిగిపోయి బంగారు వృక్షంగా మారిపోయింది. పవిత్ర హృదయంతో తీసుకొచ్చిన ఆ కానుకనే జీసెస్‌ స్వీకరించాడని అందరూ నమ్మారు. అప్పటి నుంచి క్రిస్మస్‌ చెట్టుని అలంకరిస్తున్నారు.
 
ఇలాంటిదే మరో కథ కూడా ఉంది.
చలిగాలులు వీస్తున్నాయి. మంచు కురుస్తోంది. చిన్న పాకలో అన్న వాలంటైన్‌, చెల్లి మేరీ నాన్న కోసం ఎదురుచూస్తున్నారు. ఏదైనా తిని రెండు రోజులైంది. నీర్సంగా ఉన్నారు. ఇంతలో నాన్న వచ్చాడు. చేతిలో రొట్టెముక్క! దాన్నే మూడు భాగాలు చేసుకుని ప్రార్థన చేయసాగారు.

'ఓ జీసస్‌ మాలాగే ఈ లోకంలో ఆకలితో ఉన్న వాళ్లందరీ కడుపు నింపు'. ప్రార్థన తర్వాత తినబోతుండగా తలుపు చప్పుడైంది. తీసి చూస్తే ఆరేళ్ల పిల్లాడొకడు చలికి వణికిపోతూ 'ఈ రాత్రికి ఇక్కడ ఉండనిస్తారా?' అని అడిగాడు. లోపలికి రమ్మన్నారు. 'తిని నాలుగు రోజులైంది' అన్నాడా పిల్లాడు దీనంగా. తమ రొట్టె ఇచ్చి, రగ్గు కప్పి పడుకోబెట్టారు.

అతడి ఆకలిని తీర్చగలిగామన్న తృప్తితో వాళ్లు నిద్రపోయారు. అర్థరాత్రి అన్నాచెల్లెల్లిద్దరికీ మెలకువ వచ్చింది. పైన మిలమిలలాడే నక్షత్రాలు. ఎగురుతున్న దేవదూతలు. వాళ్లింటికి వచ్చిన పిల్లాడు ఎవరో కాదు. బాల ఏసు!

తల మీద బంగారు కిరీటంతో విలువైన బట్టలతో మెరిసిపోతున్న అతడు, 'మీ దయ గొప్పది. పరలోకపు తండ్రి మీకు మేలు చేస్తాడు' అని దీవించాడు. వాళ్లింటి బయట ఎండిన కొమ్మని నాటాడు. అది చూస్తుండగానే చిగురించి పెరిగి పెద్దదైంది. దాన్నిండా బంగారు యాపిల్‌ కాయలు! అదే మొట్టమొదటి క్రిస్‌మస్‌ చెట్టు.
 
బహుమతుల తాతయ్య!
ఎర్రటి గౌను, టోపీ, తెల్లగడ్డంతో బహుమతులిచ్చే శాంతాక్లాజ్‌ తాతయ్య అసలు పేరు తెలుసా? నికోలస్‌. క్రీస్తుశకం 270 కాలంలో ఇప్పటి టర్కీ ప్రాంతంలోని ఓ చర్చిలో బిషప్‌. గుర్రం మీద తిరుగుతూ పేదవారికి సాయం చేస్తుండేవాడు. ఓ రోజు ముగ్గురు కూతుళ్లకు పెళ్లి చేయలేక బాధపడతున్న పేదవాడు కనిపించాడు.

అతడికి సాయం చేయడానికి బంగారు నాణాలు నింపిన మూడు మూటల్ని వాళ్లింటి పొగగొట్టంలోంచి పడేశాడు. ఆ డబ్బుతో పేదవాడు ఎంతో సంబరంగా కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. అలా ఎంతమందికో తనెవరో తెలియకుండా బహుమతులు ఇచ్చే అతడికే సెయింట్‌ హోదా లభించింది. అతడే శాంతాక్లాజ్‌!
 
* ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిస్మస్‌ చెట్టు ఎక్కడుందో తెలుసా? అబుదాబిలో ఓ హోటల్లో. 40 అడుగుల ఎత్తున నిర్మించిన దీని విలువ కోటి పది లక్షల డాలర్లు. ఈ చెట్టుని 181 వజ్రాలు, ముత్యాలు, విలువైన రాళ్లతో అలంకరించారు.
 
* క్రిస్మస్‌ చెట్టును మొదటిసారిగా అలంకరించింది 1510లో. ఇళ్లల్లోకి తీసుకువచ్చి చెట్టును పెట్టే సంప్రదాయం వచ్చింది 16వ శతాబ్దంలో.
 
* అమెరికాలో ఏటా మూడు కోట్ల క్రిస్మస్‌ చెట్లు అమ్ముడవుతాయి. పది లక్షల ఎకరాల్లో వీటిని పెంచుతారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments