Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోయెస్ గార్డెన్ నుంచి శశి చుట్టాలందరూ వెళ్ళిపోండి.. దీపతో పన్నీర్ రెఢీ.. చిన్నమ్మ కసి తీర్చుకుంటుందా?

చిన్నమ్మ శశికళ జైలుకెళ్లిపోయింది.. ఇక ఆపద్ధర్మ సీఎంగా పన్నీర్ సెల్వం పనికానిస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి అలాగే పోయెస్ గార్డెన్ నుంచి చిన్నమ్మ కుటుంబ సభ్యులను కూడా పంపించే దిశగా పన్నీర్ సెల్వం విస్తృత

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (13:13 IST)
చిన్నమ్మ శశికళ జైలుకెళ్లిపోయింది.. ఇక ఆపద్ధర్మ సీఎంగా పన్నీర్ సెల్వం పనికానిస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి అలాగే పోయెస్ గార్డెన్ నుంచి చిన్నమ్మ కుటుంబ సభ్యులను కూడా పంపించే దిశగా పన్నీర్ సెల్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శశికళను వ్యతిరేకించే వారందరికీ ఆపన్న హస్తం అందిస్తున్నారు. అందులో భాగంగానే శశికళను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న జయలలిత మేనకోడలు దీపకు పన్నీర్ సెల్వం అండగా నిలిచారు.
 
మంగళవారం సాయంత్రం దీపతో కలిసి జయలలిత సమాధి వద్దకు నివాళులర్పించడానికి పన్నీర్ సెల్వం వెళ్లారు. ఈ పరిణామంతో అటు దీప వర్గం, ఇటు పన్నీర్ వర్గం హర్షం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలో కూడా దీపకు కీలక బాధ్యతలు అప్పగించాలని పన్నీర్ భావిస్తున్నారు. 
 
అలాగే దీప జయకుమార్ కూడా పన్నీర్ వర్గంలో చేరడంతో సెల్వం ఇంటి ముందు రాత్రికి రాత్రే బ్యానర్లు కటౌట్లు వెలశాయి. ఆ బ్యానర్లపై ఎంజీఆర్, జయలలిత, పన్నీర్ సెల్వం, దీప ఫోటోలను ముద్రించారు. ప్రస్తుతం పన్నీర్ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. అయితే చిన్నమ్మ మాత్రం మన్నార్ గుడి మాఫియాతో పన్నీర్‌ను టార్గెట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేలను చీల్చేసిన చిన్నమ్మ.. తనను జైలుకు పంపించిన పన్నీరుపై కసి తీర్చుకునేందుకు అమ్మ సమాధిపై శపథం చేసినట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. 
 
మరి చిన్నమ్మను వారి వర్గీయులను పన్నీర్ సెల్వం ఎలా డీల్ చేస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ముందులా దూకుడుగా వ్యవహరిస్తారా? లేకుంటే బలపరీక్షలో శశి వర్గీయులను పోతే పోనీ అని వదిలి పెట్టి మౌనం వహిస్తారా? అనేది తెలియాలంటే బల నిరూపణ వరకు ఆగాల్సిందే. ఇకనైనా ఇన్‌ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్... తమిళ రాజకీయ సంక్షోభానికి తెరదించితే బాగుంటుంది..!
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments